తిరుమల గ్రామీణ బ్యాంకులో పేపర్ అడ్డుపెట్టి బంగారం చోరీ

రిపోర్టర్: వెంకట్ స్థలం: తిరుమల రూరల్

తిరుమల రూరల్ అవిలాల ఆంధ్ర గ్రామీణ బ్యాంకులో వినూత్న రీతిలో చోరీ జరిగింది. ఓ వినియోగదారుడు సీసీటీవీ కెమెరాకు పేపర్ అడ్డంపెట్టి సిబ్బంది కన్నుగప్పి సుమారు 60 గ్రాముల బంగారాన్ని కాజేశాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు బ్యాంకులోని సీసీటీవీ కెమెరాలలో స్పష్టంగా రికార్డయ్యాయి. బాధితులు, బ్యాంకు సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.