ప్రభాస్ ఫ్యాన్స్కు బిగ్ అలర్ట్: ఫౌజీ సినిమా గ్లింప్స్ అప్డేట్

రిపోర్టర్: గోపి స్థలం: హైదరాబాద్

రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న ఫౌజీ చిత్రానికి సంబంధించి అక్టోబర్ 23న ప్రత్యేక గ్లింప్స్ విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో వస్తున్న ఈ సినిమా కథ 1940ల నాటి రజాకార్ల నేపథ్యంతో సాగుతుందని, భారీ విజువల్స్తో అందమైన ప్రేమకథగా దర్శకుడు దీనిని తెరకెక్కిస్తున్నారని మేకర్స్ తెలిపారు.