'తలరాత రాసిపెట్టి ఉంటే జరుగుతుంది': బిగ్‌బాస్ హౌస్‌లో ఎమోషనల్ అయిన దేబ్జానీ

రిపోర్టర్: గోపి స్థలం: హైదరాబాద్

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 హౌస్‌లో సీరియల్ నటి దేబ్జానీ తీవ్ర భావోద్వేగానికి గురైంది. టాస్క్‌లో ఓడిపోవడంతో పాటు ప్రత్యర్థుల బలం ఎక్కువగా ఉండటంతో ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. తలరాత రాసిపెట్టి ఉంటేనే జరుగుతుందని, ఎంత ట్రై చేసినా ఫలితం లేకపోయిందని తనలో తానే మాట్లాడుకుంటూ కుమిలిపోయింది. ఈ సంఘటనకు సంబంధించిన మూడో ప్రొమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.