అమెరికాకు ఇరాన్ తీవ్ర హెచ్చరిక: మధ్యప్రాచ్యంలో సైనిక స్థావరాల పునర్నిర్మాణాన్ని అడ్డుకుంటామని స్పష్టీకరణ
రిపోర్టర్: భాస్కర్
స్థలం: తెలంగాణ
మధ్యప్రాచ్యంలో అమెరికా తన సైనిక స్థావరాలను మళ్లీ నిర్మించుకోకుండా అడ్డుకుంటామని ఇరాన్ హెచ్చరించినట్లు ఇరాన్ సైనిక అధికార ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ మొహమ్మద్ అక్రామినీయ తెలిపారు. ఈ ఘర్షణల్ లో అమెరికాకు చెందిన రెండొందలకు పైగా స్థావరాలు ధ్వంసమైనట్లు పేర్కొన్నారు. మరోవైపు తమ దళాలు అమెరికాకు చెందిన రెండు వందలకు పైగా విమానాలను కూల్చివేశాయని, క్షిపణి రక్షణ వ్యవస్థలను నిర్వీర్యం చేశాయని ఐఆర్జీసీ అధికార ప్రతినిధి హొస్సేన్ మొహెబ్బీ వెల్లడించారు.