ఆసియా క్రీడల కోసం పురుషుల క్రికెట్ జట్టుకు ప్రత్యేక వసతి ఏర్పాటు చేసిన బీసీసీఐ

రిపోర్టర్: అశోక్ స్థలం: న్యూఢిల్లీ

జపాన్ వేదికగా జరగనున్న ఆసియా క్రీడల కోసం భారత పురుషుల క్రికెట్ జట్టుకు బీసీసీఐ సొంతంగా ప్రత్యేక వసతి ఏర్పాట్లు చేసింది. సపోర్ట్ స్టాఫ్ సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా వెల్లడించారు. మహిళల జట్టు మాత్రం నిర్వాహకులు కేటాయించిన వసతిలోనే ఉంటుందని, ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించడమే తమ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.