విజయవాడలో చంద్రబాబు సభ సమీపంలో భారీ శబ్దంతో గ్యాస్ సిలిండర్ పేలుడు

రిపోర్టర్: శివ స్థలం: విజయవాడ

విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు బహిరంగ సభ సమీపంలో భారీ శబ్దంతో గ్యాస్ సిలిండర్ పేలింది. అజిత్సింగ్నగర్ మాకినేని బసవపున్నయ్య స్టేడియం సమీపంలో ఇవాళ సాయంత్రం ఈ ఘటన జరిగింది. ఒక్కసారిగా భారీ శబ్దంతో గ్యాస్ సిలిండర్ పేలడంతో సభలో ఉన్న వారు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన పోలీసులు క్షణాల వ్యవధిలో స్పందించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఎండ తీవ్రత కారణంగానే సిలిండర్ పేలినట్టు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ ప్రమాదంతో ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.