జనసేన సమన్వయ కమిటీ సభ్యునిగా కె.చంద్రశేఖర్ నియామకం
రిపోర్టర్: పి రాజేష్ కుమార్
స్థలం: గంగాధర నెల్లూరు
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ బలోపేతం కోసం పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమన్వయ కమిటీలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియమించారు. ఇందులో భాగంగా గంగాధర నెల్లూరు నియోజకవర్గం నుంచి కె.చంద్రశేఖర్ సమన్వయ కమిటీ సభ్యునిగా ఎంపికయ్యారు.
పార్టీ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో జన సైనికులను, వీర మహిళలను ఎన్నికలకు సిద్ధం చేయడమే లక్ష్యంగా ఈ కమిటీలు పనిచేయనున్నాయి. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన పవన్ కళ్యాణ్ కు చంద్రశేఖర్ కృతజ్ఞతలు తెలిపారు.