తీపి కబురు: కడప-రేణిగుంట గ్రీన్ ఫీల్డ్ హైవే పనులు వేగవంతం

రిపోర్టర్: అశోక్ స్థలం: కడప

ఆంధ్రప్రదేశ్ ప్రయాణికులకు మరియు తిరుమల శ్రీవారి భక్తులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించినట్లు ఎన్హెచ్ఏఐ అధికారులు తెలిపారు. రూ.2,254 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న 122 కిలోమీటర్ల కడప-రేణిగుంట నాలుగు లైన్ల గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే పనులు వేగంగా జరుగుతున్నాయని వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే ప్రయాణ సమయం గణనీయంగా తగ్గడంతో పాటు రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయని అధికారులు స్పష్టం చేశారు.