ఆటో డ్రైవర్ల మానవత్వం.. మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయం
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: గుర్రంపోడ్
గుర్రంపోడు మండలం పిట్టలగూడెం గ్రామంలో ఆటో డ్రైవర్లు మానవత్వాన్ని చాటుకున్నారు. జై శ్రీరామ్ ఆటో యూనియన్ సభ్యుడు బైరి గిరి ఇటీవల అకాల మరణం చెందడంతో, తోటి డ్రైవర్లు ఆయన కుటుంబాన్ని పరామర్శించి రూ.10 వేల ఆర్థిక సాయం అందజేశారు.
యూనియన్ అధ్యక్షుడు పోలే లాలయ్య మాట్లాడుతూ గిరి కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కష్టకాలంలో ఆటో డ్రైవర్లు చూపిన ఈ చొరవపై గ్రామస్తులు ప్రశంసలు కురిపించారు.