హరియాణాలో ప్రేమ పెళ్లిళ్లపై గ్రామ పంచాయతీ వివాదాస్పద నిషేధం
రిపోర్టర్: హరి
స్థలం: హరియాణా
హరియాణాలోని హిసార్ జిల్లా ఆర్యానగర్ గ్రామంలో ప్రేమ పెళ్లిళ్లను నిషేధిస్తూ పంచాయతీ పెద్దలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. గ్రామానికి చెందిన యువతీయువకులు పరస్పరం వివాహం చేసుకోవద్దని, ఉల్లంఘిస్తే సామాజిక బహిష్కరణ తప్పదని హెచ్చరించారు. ఒకే గ్రామంలో వివాహాలు చేసుకుంటే సామాజిక సంప్రదాయాలు దెబ్బతింటాయని, భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీజేపీ నేత హనుమాన్ వర్మ తెలిపారు.