తెలుగుదేశం పార్టీలో చేరికలు: వైకాపాను వీడి కూటమి ప్రభుత్వంలోకి వంద మందికి పైగా కార్యకర్తలు
రిపోర్టర్: గోపి
స్థలం: విశాఖపట్నం
జీవీఎంసీ పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన వంద మందికి పైగా వైకాపా కార్యకర్తలు ఎంవీపీ కాలనీ క్యాంప్ కార్యాలయంలో తన సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరినట్లు విశాఖపట్నం నేత గంట శ్రీనివాస రావు వెల్లడించారు. వారందరికీ పసుపు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించినట్లు ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ పాలనకు ఆకర్షితులై వీరంతా పార్టీలో చేరడం శుభపరిణామమని ఆయన స్పష్టం చేశారు.