హిందీని పూర్తిగా నిరాకరించలేమంటూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

రిపోర్టర్: గోపి స్థలం: భారతదేశం

తమిళనాడులో హిందీ భాష బోధనపై కొనసాగుతున్న వివాదంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటు కేసు విచారణ సందర్భంగా జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్‌లతో కూడిన ధర్మాసనం స్పందిస్తూ, హిందీని తమిళనాడు భూభాగంలో పూర్తిగా నిరాకరించలేమని, రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలని సూచించింది. అలాగే నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు భూమిని గుర్తించాలని ఇచ్చిన ఆదేశాన్ని వెనక్కి తీసుకోవడానికి నిరాకరిస్తూ, అమలుకు మరో మూడు నెలల సమయం ఇచ్చింది.