అమెరికాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు: పదిహేను వేల మందితో మహా సంబరం

రిపోర్టర్: శివ స్థలం: హైదరాబాద్

అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం ఫ్రిస్కో నగరంలో తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రతిష్టాత్మక కొమెరికా సెంటర్ వేదికగా జరిగిన ఈ మహా సంబరాలకు దాదాపు పదిహేను వేల మంది ప్రవాస తెలుగు ప్రజలు హాజరయ్యారని వారు వెల్లడించారు. వెయ్యి మందికి పైగా మహిళలు సాంప్రదాయ రీతిలో ఆటపాటలతో వేడుకలను అంబరాన్నంటేలా చేశారని, సినీ నటుడు నవీన్ పొలిశెట్టి మరియు గాయకుడు కృష్ణ చైతన్యల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని పేర్కొన్నారు.