ఉగ్రవాద దేశమే ఆ ప్రశ్న అడుగుతోందంటూ పాకిస్థాన్పై ఎస్ జైశంకర్ మండిపాటు

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: న్యూయార్క్

ఐక్యరాజ్యసమితి సమావేశంలో పాకిస్థానీ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఘాటుగా బదులిచ్చారు. న్యూయార్క్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఉగ్రవాదానికి మద్దతుపై పాక్ జర్నలిస్ట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేయగా, ఒక ఉగ్రవాద దేశమే నన్ను ఆ ప్రశ్న అడుగుతోందని జైశంకర్ నిలదీశారు. సరిహద్దు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్ తీరును ఆయన తప్పుపట్టారు.