కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి ఘనంగా నిర్వహించిన ఆర్టీసి
రిపోర్టర్: Ram
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ లోని బస్‌భవన్‌లో కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సంస్థ ఈడీ వెంకన్న బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన త్యాగాలు భావితరాలకు ఎప్పటికీ స్ఫూర్తినిస్తాయని వెల్లడించారు.