సత్యసాయి మందిరాలలో భక్తిశ్రద్ధలతో వినాయక నవరాత్రుల ప్రారంభం

రిపోర్టర్: Alfa News Desk స్థలం: ఎచ్చెర్ల

శ్రీకాకుళం జిల్లాలోని సత్యసాయి మందిరాలలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయని జిల్లా అధ్యక్షులు సూర రామచంద్రరావు తెలిపారు. శ్రీకాకుళం పెద్ద మందిరంలో డాక్టర్ తెన్నేటి విక్రమశర్మ ఆధ్వర్యంలో విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం వేదమంత్రాల నడుమ జరిగింది. భక్తుల కొరకు 101 గంటల అఖండ నామ సంకీర్తనతో పాటు తొమ్మిది రోజుల పాటు పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.