విజయవాడలో దంచికొట్టిన భారీ వర్షం, జలమయమైన లోతట్టు ప్రాంతాలు
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: ఎన్టీఆర్ జిల్లా
విజయవాడలో భారీ వర్షం కురిసింది. నగరంలో నలభై నిమిషాల పాటు దంచికొట్టిన వానకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులు నీట మునిగిపోవడంతో వాహనదారులు రాకపోకలు సాగించడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లోబ్రిడ్జిల కింద భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది.