పాఠశాలలో విద్యార్థులతో నీళ్లు మోయిస్తున్నారంటూ ఆదోనిలో తీవ్ర ఆందోళన
రిపోర్టర్: KISHORE M
స్థలం: ఆదోని
ఆదోని పురపాలక ఆదర్శ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో నీటి బిందెలు మోయిస్తున్నారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. చదువుకోవాల్సిన వేళ విద్యార్థులతో ఇలాంటి పనులు చేయించడంపై తల్లిదండ్రులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలో నీటి సదుపాయం లోపించడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని, విద్యాశాఖ అధికారులు తక్షణమే స్పందించి విచారణ జరపాలని వారు డిమాండ్ చేస్తున్నారు.