ట్యాక్షన్ పేటెంట్ ఉల్లంఘన కేసులో యాపిల్‌కు భారీ జరిమానా
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: అమెరికా
యాపిల్ సంస్థ తమ పేటెంట్ హక్కులను ఉల్లంఘించిందని అమెరికా కోర్టు స్పష్టం చేసినట్లు ట్యాక్షన్ టెక్నాలజీ ప్రతినిధులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో యాపిల్ ఐదు బిలియన్ డాలర్లకు పైగా నష్టపరిహారం చెల్లించాలని అమెరికా జ్యూరీ ఆదేశించింది. ట్యాప్టిక్ ఇంజన్ టెక్నాలజీలో తమ పేటెంట్లను అనుమతి లేకుండా వాడుకున్నారని ఆరోపించారు. అయితే జ్యూరీ తీర్పును తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, దీనిపై అప్పీలుకు వెళ్లనున్నట్లు యాపిల్ సంస్థ స్పష్టం చేసింది.