కృత్రిమ మేధ నియంత్రణ అత్యంత కీలకం అంటూ కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడి

రిపోర్టర్: రమేష్ స్థలం: New Delhi

కృత్రిమ మేధ సాంకేతికత వల్ల కలిగే ప్రయోజనాలతో పాటు వినియోగదారుల భద్రతకు ముప్పు పొంచి ఉందని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు. SEMICON India 2026 సదస్సు సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏఐ సాంకేతికతలో యూజర్ సేఫ్టీ అంశం అత్యంత సంక్లిష్టమైనదని పేర్కొన్నారు. ఆన్‌లైన్ ప్రపంచంలో పౌరులను రక్షించడానికి, సరైన నియంత్రణ విధానాలను రూపొందించడానికి ప్రభుత్వం పరిశ్రమ వర్గాలతో కలిసి పనిచేస్తోందని ఆయన తెలిపారు.