మిషన్ లైఫ్ ప్రచారంలో భాగంగా బ్రిక్స్ సస్టెయినబుల్ వీక్ నిర్వహణకు యూజీసీ ఆదేశాలు
రిపోర్టర్: నరేష్
స్థలం: New Delhi
దేశంలోని అన్ని కళాశాలలు, విశ్వవిద్యాలయాలు నవంబర్ ఒకటో తేదీ నుంచి ఏడో తేదీ వరకు బ్రిక్స్ సస్టెయినబుల్ లైఫ్ స్టైల్ వీక్ కార్యక్రమాలను నిర్వహించాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఆదేశించింది. ఈ మేరకు విద్యార్థులలో పర్యావరణ అనుకూల అలవాట్లను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని అధికారులు స్పష్టం చేశారు. వివిధ థీమ్‌ల వారీగా క్యాంపస్‌లలో అవగాహన సదస్సులు నిర్వహించి నివేదికలు సమర్పించాలని పేర్కొన్నారు.