ప్రజాస్వామ్య హక్కుల కోసం వామపక్షాల ఐక్య పోరాటం అవసరమన్న రాజేంద్రప్రసాద్

రిపోర్టర్: PRASAD స్థలం: బెల్లంపల్లి

ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణకు వామపక్షాలు ఐక్యంగా పోరాడాలని ఎంసీపీఐ(యు) జిల్లా కార్యదర్శి సబ్బని రాజేంద్రప్రసాద్ పిలుపునిచ్చారు. బెల్లంపల్లిలో మద్ది కాయల ఓంకార్ వర్ధంతి సందర్భంగా ఆయన స్మారక స్థూపం వద్ద ఘనంగా నివాళులర్పించారు. మార్క్సిజం, అంబేద్కర్ ఆలోచనా విధానాలతోనే సమాజంలో ఆర్థిక సమానత్వం సాధ్యమని ఈ సభలో నేతలు స్పష్టం చేశారు.