నెల్లూరు జిల్లాలో విషాదం: బైక్కు వాటర్ సర్వీసింగ్ చేస్తుండగా విద్యుదాఘాతంతో మెకానిక్ మృతి
రిపోర్టర్: మహేష్
స్థలం: నెల్లూరు
నెల్లూరు జిల్లా పొదలకూరులోని టైలర్స్ కాలనీలో ద్విచక్ర వాహనానికి వాటర్ సర్వీసింగ్ చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై మొహిద్దీన్ అనే మెకానిక్ మృతి చెందాడు. డైకాస్ రోడ్డుకు చెందిన ఆయన సోమవారం షోరూంలో ఈ ప్రమాదానికి గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతునికి భార్య, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.