రణబాలి బాక్సాఫీస్ సునామీ: డియర్ కామ్రేడ్ రికార్డులను బద్దలు కొట్టిన సినిమా

రిపోర్టర్: అశోక్ స్థలం: హైదరాబాద్

విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్న జంటగా నటించిన తాజా పీరియాడికల్ చిత్రం రణబాలి ప్రపంచవ్యాప్తంగా ఎనభై కోట్ల రూపాయల వసూళ్లను అధిగమించి కొత్త మైలురాయిని తాకిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన డియర్ కామ్రేడ్ కలెక్షన్లను ఈ చిత్రం పూర్తిగా వెనక్ కి నెట్టిందని పేర్కొన్నాయి. అయితే ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా వసూళ్ల వేగం కాస్త మందగించినట్లు వివరించాయి.