బీఆర్ఎస్ పార్టీలోకి చేరికల సభకు వెళ్తున్న హరీష్ రావుకు ఘన స్వాగతం
రిపోర్టర్: ఎన్ రవిందర్ రెడ్డి
స్థలం: ఆత్మకూరు(ఎం)
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మాజీ శాసనసభ్యులు గొంగిడి సునీత మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన చేరికల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావుకు మార్గంమధ్యలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. భువనగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ ఇంచార్జ్ క్యామ మల్లేష్, మాజీ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్ రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తదితరులు కలిసి ఆయనకు స్వాగతం తెలిపారు.