అనకాపల్లిలో ఎంపీ లాడ్స్ నిధులతో ఆర్వో వాటర్ ప్లాంట్ ప్రారంభం

రిపోర్టర్: సురేష్ స్థలం: అనకాపల్లి

అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం అరిపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఎంపీ లాడ్స్ నిధులతో ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్ను ప్రారంభించినట్లు అనకాపల్లి ఎంపీ డాక్టర్ సి.ఎం. రమేష్ వెల్లడించారు. సుమారు ఆరు లక్షల రూపాయల వ్యయంతో పాఠశాల విద్యార్థులకు తాగునీరు అందించేందుకు ఈ ప్లాంట్ను నిర్మించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.