షాకింగ్ ఘటన: చలాన్ పేరుతో రైతు ఖాతా నుంచి ఐదు లక్షలు మాయం

రిపోర్టర్: విజయ్ స్థలం: ఆలూరు

ఆర్టీఏ చలాన్ పేరుతో వచ్చిన నకిలీ మెసేజ్ను నమ్మి ఆలూరు మండలానికి చెందిన బంజ అంబేద్కర్ అనే రైతు ఐదు లక్షల పది వేల రూపాయలు పోగొట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. వడ్లు అమ్మి బ్యాంకులో దాచుకున్న సొమ్ము సైబర్ నేరగాళ్ల బారిన పడడంతో బాధితుడు కన్నీరుమున్నీరవుతున్నాడని, అపరిచిత లింకుల విషయంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆర్మూర్ సీఐ చంద్రశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు.