వింజమూరు చెరువులో అడ్డగోలుగా మట్టి అక్రమ తవ్వకాలు
రిపోర్టర్: భాస్కర్
స్థలం: తిరుపతి
తిరుపతి జిల్లా వింజమూరులో సీఎం చంద్రబాబు పరిశీలించిన పాతూరు చెరువులో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. రాత్రి సమయాల్లో యంత్రాలు, ట్రాక్టర్లతో ఇష్టారాజ్యంగా మట్టిని తోడేస్తూ రియల్ ఎస్టేట్ లేఔట్లకు తరలిస్తున్నారు. జలవనరుల శాఖ కార్యాలయం సమీపంలోనే ఈ అక్రమ తవ్వకాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. అనుమతులు లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు.