ప్రజల ఇంటి ముంగిటకే వైద్యం అందించడమే లక్ష్యమన్న ఎమ్మెల్యే గణబాబు
రిపోర్టర్: అశోక్
స్థలం: విశాఖపట్నం
ప్రజల ఇంటి ముంగిటకే నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించడమే లక్ష్యంగా చేపట్టిన సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు ముఖ్య అతిథిగా పాల్గొని వైద్య సేవలను ప్రారంభించారు. మాతా శిశు ఆరోగ్యం, టీకాలు, ఎన్సీడీలు, టీబీ, అంటువ్యాధుల నివారణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన తెలిపారు.