యాదాద్రి భువనగిరిలో ఘనంగా పదకొండో ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: యాదాద్రి భువనగిరి

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని హోమియోపతి ఆసుపత్రిలో ఆయుష్ ఆధ్వర్యంలో 11వ ఆయుర్వేద దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ధన్వంతరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరంలో రోగులకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.