ఐఫోన్ 18 ప్రో కొనుగోలు కోసం ఎగబడ్డ టెక్ ప్రియులు
రిపోర్టర్: రాజేష్
స్థలం: Noida
దేశవ్యాప్తంగా నూతన ఐఫోన్ 18 ప్రో విక్రయాలు ప్రారంభం కావడంతో ఆపిల్ స్టోర్ల ముందు కొనుగోలుదారులు బారులు తీరారు. నోయిడాలోని డిఎల్‌ఎఫ్ మాల్‌లో ఉన్న ఆపిల్ స్టోర్ వద్ద ఉదయం 8 గంటల ముందే భారీ క్యూ ఏర్పడింది. తన భార్య కోసం బంగారం అమ్మి మరీ ఐఫోన్ కొనుగోలు చేసినట్లు ఓ వ్యక్తి తెలపగా, పంజాబ్ నుంచి వచ్చిన మరో యువకుడు తన కాబోయే భార్య కోసం ప్రత్యేకంగా ఈ ఫోన్‌ను కొనుగోలు చేయడం విశేషం.