తెలంగాణ రక్షణ సేనలోకి కేస్లాపూర్‌ నాగోబా కమిటీ ఛైర్మన్‌

రిపోర్టర్: సురేష్ స్థలం: ఆదిలాబాద్

ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ నాగోబా ఆలయ కమిటీ ఛైర్మన్ మెస్రం ఆనందరావుతో పాటు పలువురు నేతలు తెలంగాణ రక్షణ సేనలో చేరారు. బంజారాహిల్స్‌లోని కార్యాలయంలో ఆ పార్టీ చీఫ్‌ కల్వకుంట్ల కవిత వీరికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఇంద్రవెల్లి సర్పంచుల సంఘం అధ్యక్షుడు మెస్రం భీంరావుతో పాటు పలువురు సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు పాల్గొన్నారు.