హైదరాబాద్ పోలీసుల అమ్ములపొదిలోకి ఈవీలు: 15 ఎలక్ట్రిక్ కార్లను ప్రారంభించిన డీజీపీ సీవీ ఆనంద్

రిపోర్టర్: రమేష్ స్థలం: హైదరాబాద్

మహిళలు మరియు పిల్లల రక్షణే ధ్యేయంగా హైదరాబాద్ సిటీ పోలీసుల అమ్ములపొదిలోకి సరికొత్తగా 15 ఈవీ స్మార్ట్ ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకొచ్చినట్లు Hyderabad City Police వెల్లడించారు. ఇందులో భాగంగా స్పందన విధులకు 7 మరియు శాంతిభద్రతల పరిరక్షణ కోసం 8 కార్లను కేటాయించామని తెలిపారు. నగరంలో వీటిని డీజీపీ సీవీ ఆనంద్ అధికారికంగా ప్రారంభించారని, దీనివల్ల భద్రతా చర్యలు మరింత వేగవంతం కానున్నాయని పేర్కొంటూ అధికారులు స్పష్టం చేశారు.