బీజేపీలోకి భారీగా వలసలు పార్టీలోకి సాగరంగా ఆహ్వానించిన వంశీధర్ రెడ్డి
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: బుచ్చిరెడ్డిపాలెం
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం రూరల్ మండలం నుంచి ఎస్సీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు గోళ్ల నరసింహులు ఆధ్వర్యంలో సుమారు 20 మంది బీజేపీలో చేరారు. పల్లాపల్లి, అంబేద్కర్ నగర్ ప్రాంతాల నుంచి వచ్చిన వీరికి పార్టీ జిల్లా అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు డిఎస్ పరశురాం సాగరంగా ఆహ్వానం పలికారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడాలని ఈ సందర్భంగా నూతన సభ్యులకు పార్టీ అధ్యక్షులు పిలుపునిచ్చారు.