గువహాటిలో భయానక హత్య: ఫ్రిజ్‌లో మహిళ తల లభ్యం!

రిపోర్టర్: మహేష్ స్థలం: అస్సాం

అస్సాం రాజధాని గువహాటిలో దారుణం చోటుచేసుకుంది. బసిస్థపూర్ ప్రాంతంలో 25 ఏళ్ల వివాహిత రియా తాలుక్దార్ గోస్వామిని అతి క్రూరంగా హత్య చేశారు. ఆమె భర్త రామానుజన్ గోస్వామి తలను నరికి ఫ్రిజ్‌లో ఉంచాడు. దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. నిందితుడు పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు.