వెదురు బొమ్మల తయారీతో ఆర్థికంగా నిలదొక్కుకుంటున్న జన్నారం ఆదివాసీ మహిళలు

రిపోర్టర్: Gangadhar Reporter స్థలం: జన్నారం

మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని ఇంధన్పల్లి అనుబంధ నాయకపుగూడ ఆదివాసి మహిళలు వెదురు ఉత్పత్తుల తయారీతో స్వయం ఉపాధి పొందుతున్నారు. అటవీ ప్రాంతంలో ఆంక్షల కారణంగా ఉపాధి తగ్గిపోవడంతో అటవీశాఖ ప్రత్యేకంగా శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ కేంద్రంలో మహిళలు వెదురుతో రకరకాల వస్తువుల తయారీ నేర్చుకుంటూ వాటిని మార్కెట్లో విక్రయిస్తూ కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలుస్తున్నారు.