నా వ్యాపారానికి ఉచిత ప్రచారం కల్పించినందుకు థ్యాంక్స్ అంటూ రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ సెటైర్లు
రిపోర్టర్: కిరణ్
స్థలం: సిరిసిల్ల
తన హోటళ్ల వ్యాపారంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో స్పందించారు. తాను గతంలోనే ఎన్నికల అఫిడవిట్లలో అన్ని వివరాలు స్పష్టంగా పేర్కొన్నానని కేటీఆర్ వెల్లడించారు. కుటుంబ పోషణ కోసం తాను వ్యాపారం చేస్తున్నానని, ప్రస్తుతం తనకు మూడు హోటళ్లు మాత్రమే ఉన్నాయని తెలిపారు. రాజకీయాల్లోకి రాకపోతే తనకు పది హోటళ్లు ఉండేవని పేర్కొంటూ, తన వ్యాపారానికి ఉచితంగా ప్రచారం కల్పించినందుకు సీఎం రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.