సీతారామపురంలో ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు నిర్వహించిన తెదేపా శ్రేణులు
రిపోర్టర్: సురేష్
స్థలం: సీతారామపురం
ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా సీతారామపురంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు. తెదేపా మండల అధ్యక్షుడు చింతల శ్రీనివాసులు ఆధ్వర్యంలో నాయకులు కొవ్వొత్తులను వెలిగించి ప్రదర్శన నిర్వహించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ మరింత అభివృద్ధి పథంలో పయనిస్తోందని ఈ సందర్భంగా వక్తలు కొనియాడారు.