హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం: లారీని ఢీకొన్న కారు డ్రైవర్ కు తీవ్ర గాయాలు

రిపోర్టర్: నరేష్ స్థలం: కొడిమ్యాల

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూర్ గ్రామ శివారులోని కరీంనగర్ జగిత్యాల ప్రధాన రహదారిపై వేగంగా వస్తున్న గూడ్స్ లారీ కారును ఢీకొనడంతో కారు డ్రైవర్ తీవ్రంగా గాయపడినట్లు స్థానికులు తెలిపారు. కరీంనగర్ కు చెందిన దంపతులు నిర్మల్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి అంబులెన్స్ ద్వారా క్షతగాత్రుడిని కరీంనగర్ హాస్పిటల్ కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.