చెన్నారావుపేట: తేనెటీగల దాడిలో వ్యవసాయ కూలీలకు తీవ్ర అస్వస్థత

రిపోర్టర్: Alfa News Desk స్థలం: చెన్నారావుపేట

వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం చెరువుకొమ్ము తండాలో వ్యవసాయ కూలీలపై తేనెటీగలు దాడి చేశాయి. పనుల్లో నిమగ్నమైన కూలీలపై ఒక్కసారిగా దాడి చేయడంతో పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని క్షతగాత్రులకు ప్రాథమిక వైద్యం అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం వారిని అంబులెన్స్లో నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి అత్యవసరంగా తరలించారు.