కేసీఆర్ ఫామ్ హౌస్ పై అబద్ధాలు చెప్పిన సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్
రిపోర్టర్: నరేష్
స్థలం: హైదరాబాద్
కేసీఆర్ ఫామ్ హౌస్ వెయ్యి ఎకరాలంటూ పదే పదే అబద్ధాలు చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే తప్పు ఒప్పుకొని క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ ఫామ్ హౌస్ 67 ఎకరాలేనని అసెంబ్లీ సాక్షిగా సీఎం ఒప్పుకున్నారని, కేసీఆర్ ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణకు సిద్ధమా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు.