మ్యాపింగ్ తప్పులతో పింఛన్లకు దూరం: విజయనగరం కలెక్టరేట్ వద్ద బాధితుల ఆవేదన

రిపోర్టర్: మహేష్ స్థలం: విజయనగరం

హౌస్హోల్డ్ మ్యాపింగ్లో తప్పుల కారణంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల దరఖాస్తులకు దూరమయ్యామని వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు ఆవేదన వ్యక్తం చేశారు. విజయనగరం కలెక్టరేట్లో అధికారులకు బాధితులు వినతిపత్రాలు అందజేసినట్లు జిల్లా సచివాలయ అధికారిణి ఎస్.రోజారాణి తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఇలాంటి బాధితులు సుమారు మూడు వేల మంది వరకు ఉన్నారని అధికారులు పేర్కొన్నారు. సాంకేతిక సమస్యలను పరిష్కరించి తమకు న్యాయం చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు.