సినిమా పోస్టర్లలో ధూమపాన ప్రదర్శనపై దర్శకుడు సంజయ్ గుప్తా నిప్పులు

రిపోర్టర్: రాము స్థలం: ముంబై

సినిమా పోస్టర్లలో హీరోలు సిగరెట్లు తాగుతూ కనిపించడంపై ప్రముఖ దర్శకుడు సంజయ్ గుప్తా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. థియేటర్లలో ప్రదర్శించే యాంటీ స్మోకింగ్ ప్రకటనలకు, చిత్రాల పోస్టర్లలో ఉండే ధూమపాన దృశ్యాలకు పొంతన లేదని ఆయన మండిపడ్డారు. రణబీర్ కపూర్, రణ్వీర్ సింగ్, విక్కీ కౌశల్ పోస్టర్లను ఉదహరిస్తూ ఆయన ప్రశ్నించారు. ఈ తరుణంలో చిత్రాల్లో మాదకద్రవ్యాలు, ధూమపాన ప్రదర్శనపై సెన్సార్ బోర్డు నిబంధనలను మరింత కఠినతరం చేస్తోంది.