గుర్గావ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, జోమాటో డెలివరీ బాయ్ మృతి

రిపోర్టర్: శివ స్థలం: Gurgaon

హర్యానా రాష్ట్రం గుర్గావ్‌లోని సైబర్ హబ్ సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన ఘోర హిట్ అండ్ రన్ ప్రమాదంలో 45 ఏళ్ల జోమాటో డెలివరీ రైడర్ జనక్ సింగ్ మృతి చెందాడు. శంకర్ చౌక్ నుండి ఇఫ్కో చౌక్ వైపు వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఆయన మోటార్ సైకిల్‌ను ఢీకొట్టి పరారైంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన ప్రాణాలు కోల్పోగా, పోలీసులు కేసు నమోదు చేసి సీసీటీవీ టేజ్ ఆధారంగా వాహనం కోసం గాలిస్తున్నారు.