బిగ్ బాస్ హౌస్ లో అదరగొట్టిన ఛత్రపతి స్పూప్
రిపోర్టర్: కృష్ణ
స్థలం: హైదరాబాద్
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో 12వ రోజు ఎపిసోడ్‌కు సంబంధించి విడుదలైన మొదటి ప్రొమో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. హౌస్‌లో నరేష్, రామ్‌ప్రసాద్, టెంపర్ వంశీ, అమన్‌లు కలిసి చేసిన ఛత్రపతి స్పూప్ కామెడీ హైలైట్‌గా నిలిచింది. కాట్ రాజ్‌గా నరేష్, సూరీడుగా రామ్‌ప్రసాద్, ఛత్రపతి పాత్రలో టెంపర్ వంశీ నటించి నవ్వులు పూయించారు. వీరు చేసిన కామెడీకి బిగ్‌బాస్ వేసిన కౌంటర్లు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నాయి.