నిర్మల్ జిల్లా ఇన్చార్జి అదనపు కలెక్టర్ గా రాథోడ్ రమేష్ బాధ్యతల స్వీకరణ
రిపోర్టర్: వెంకట్
స్థలం: నిర్మల్
నిర్మల్ జిల్లా ఇన్‌ఛార్జి అదనపు కలెక్టర్‌గా డీఆర్వో రాథోడ్ రమేష్ బుధవారం కలెక్టరేట్‌లో అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు జిల్లా అధికారులు, రెవెన్యూ ఉద్యోగులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా పరిపాలన మరియు రెవెన్యూ శాఖ కార్యక్రమాలపై అధికారులు ఆయనకు వివరాలు అందించారు.