సాలూరులో లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

రిపోర్టర్: హరి స్థలం: సాలూరు

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న లబ్ధిదారులకు రూ.4,50,508 విలువైన సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఆపదలో ఉన్న ప్రతి కుటుంబానికి భరోసా కల్పించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. ప్రజల కష్టాల్లో నిత్యం తోడుగా నిలుస్తామని భసానిచ్చారు.