అసోం విద్యాశాఖలో ఏఐ విప్లవం: ఐఐటీ మద్రాస్‌తో కీలక ఒప్పందం
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: అసోం
అసోం ప్రభుత్వం విద్యావ్యవస్థలో కృత్రిమ మేధ (AI) వినియోగాన్ని పెంచేందుకు ఐఐటీ మద్రాస్ మరియు ఆరు సంస్థలతో ఒప్పందం చేసుకుంది. 50 పాఠశాలల్లో పైలట్ ప్రాజెక్టుగా ఏఐ ప్లాట్‌ఫామ్‌లను ప్రవేశపెడుతున్నారు. ఉపాధ్యాయులకు పాఠాల ప్రణాళికలో, విద్యార్థులకు గణితం, భాషా నైపుణ్యాల మెరుగుదలకు ఇది దోహదపడుతుంది. పరీక్షల నిర్వహణలో కూడా సాంకేతికతను పెంచుతామని విద్యాశాఖ మంత్రి రనోజ్ పెగు స్పష్టం చేశారు.