తీరానికి మురసు తీవ్ర తుపాను ముప్పు: ఒంగోలు సమీపంలో తీరం దాటే అవకాశం

రిపోర్టర్: గోపి స్థలం: Ongole

మురసు తీవ్ర తుపాను ముప్పు పొంచివుందని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. బంగాళాఖాతంలో కదులుతున్న ఈ తుపాను అర్ధరాత్రి దాటాక ఒంగోలు సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. దీని ప్రభావంతో దక్షిణకోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండి ఇళ్లలోనే ఉండాలని కలెక్టర్ సూచించారు. నిజాంపట్నం, వాడరేవు ఓడరేవుల్ లో పదవ నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.