మదనపల్లెలో అక్టోబర్ 2న రాయలసీమ హార్టికల్చర్ హబ్ ప్రాజెక్టు ప్రారంభం
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: అన్నమయ్య
రాయలసీమ దశదిశ మార్చే ఉద్దేశంతో మదనపల్లెలో అక్టోబర్ 2న కేంద్రమంత్రి నిర్మాలా సీతారామన్, సీఎం చంద్రబాబు కలిసి రాయలసీమ హార్టికల్చర్ హబ్ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. కేంద్ర ప్రభుత్వ పూర్వోదయ పథకం కింద రూ.40 వేల కోట్లు, మరో రూ.60 వేల కోట్ల ప్రైవేటు పెట్టుబడులతో ఈ ప్రాజెక్టును అమలు చేయనున్నారు. కరువు పీడిత ప్రాంతాల్లో హార్టికల్చర్ రంగాన్ని ప్రోత్సహించి సంపద పెంచడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టుతో పాటు రిలయన్స్ ఆధ్వర్యంలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్కు శంకుస్థాపన చేయనున్నారు.